ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని జట్లు కూడా మరింత వీరోచితంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాయ్. ఎందుకంటే ఇక వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్ అన్ని జట్లు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉన్నాయి.



 దీంతో ఇక ఐపీఎల్ పోరు ప్రస్తుతం మరింత రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇలా లీగ్ మ్యాచ్లలో ఓడిపోతున్న కొన్ని జట్లు చివరికి ప్లే ఆఫ్ ఆశలను కోల్పోయి ఇంటిదారి పట్టే పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి కూడా పేలవమైన  ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వరుస పరాజయాలతో సతమతమైన ఢిల్లీ క్యాపిటల్స్ ఇక ప్లే ఆఫ్ చేరే అవకాశాలను పూర్తిగా కోల్పోయింది. ఇక ఇటీవల రాజస్థాన్ చేతిలో ఓడిపోవడం ద్వారా కోల్కతా నైట్ రైడర్స్ కి కూడా ఇదే పరిస్థితి వచ్చింది.




 ఇటీవల రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో కోల్కతా ఘోర ఓటమి చవిచూసింది.  ఏకంగా 47 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ ఐదు విజయాలు ఏడు ఓటమిలతో పది పాయింట్ల తో పాయింట్ల  పట్టికలో ఏడవ స్థానానికి పడిపోయింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప కోల్కతా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: