సాదరణంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ టూల్స్ ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్లాస్టిక్ స్టూల్స్ ఉపయోగించేవారు ఒక విషయాన్ని చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ప్లాస్టిక్ స్టూల్స్ సరిగ్గా గమనిస్తే.. మీకు ఒక విషయం అర్థమవుతుంది. స్టూల్ మధ్యలో  పైన భాగంలో ఒక రంద్రం ఉంటుంది అన్న విషయం తెలిసిందదే. అయితే ఇది ఏదో డిజైన్ కోసం పెట్టారేమో అనుకొని ప్రతి ఒక్కరు కూడా చూసి ఊరుకుంటారు. కానీ ఇలా ప్లాస్టిక్ స్టూల్ పైన భాగంలో ఒక హోల్ ఉండడం వెనుక ఒక పెద్ద కారణమే ఉందట.



 అయితే ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో ఒక రంద్రం ఉండడం వెనక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయట.. మొదటిది స్టూల్స్ బలాన్ని పెంచడం. చతురస్రం, త్రిభుజం లేదా మరేదైనా ఆకారంలో ఉన్న స్టూల్ పై భాగంలో గుండ్రటి రంధ్రం ఉంటుంది . దీనికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి స్టూల్ పై కూర్చున్నప్పుడు.. అతని బరువు ఈ రంధ్రం పై పడి ఇక అతను తన బరువును నాలుగు కాళ్లపై సమానంగా పంపిణీ చేస్తాడు. ఇలాంటి చర్య వల్ల ఇక ఎంత బరువు వేసినప్పటికీ స్టూల్ విరిగిపోదట.



 ఇక రెండో కారణం.. వ్యాక్యూమ్  ఏర్పడకుండా నివారించడం. ఒకదానిపై మరొకటి ఉంచిన కుర్చీల నుంచి మీరు తరచుగా మీకోసం ఒక కుర్చీని తీయడం చేస్తుంటారు. ఇక మీరు దీన్ని చేయడం చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు. అయితే కుర్చీలు ఒకదానికి ఒకటి అతుక్కుపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది.  ఇక దీనికి కారణం వ్యాక్యూమ్ లేకపోవడమే. అయితే ఇక ఈ రంద్రం ద్వారా ఒకదానిపై ఒకటి ఉంచినప్పటికీ వాక్యూమ్ ఉండడం కారణంగా అవి సులభంగానే ఇక విడగొట్టేందుకు అవకాశం ఉంటుందట.


 ఇక మరోవైపు ఆ రంధ్రంలో వేలు పెట్టి ఎంతో సులభంగా ప్లాస్టిక్ స్టూల్ ని ఒక దగ్గర నుంచి మరో దగ్గర పెట్టవచ్చట. అయితే ఇక్కడ ఇంజనీర్లను ప్రశంసించాల్సిన విషయం ఒకటి ఉంది. రంద్రం పెద్దదిగా చేస్తే స్టూల్ త్వరగా విరిగిపోతుంది. అది చాలా చిన్నదిగా చేస్తే అప్పుడు వేలు దానిలో ప్రవేశించదు. దీని కారణంగా రంధ్రం యొక్క పరిమాణం కూడా జాగ్రత్తగా రూపొందించబడుతుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: