సాలెపురుగులను పాములు చంపి తినడం అందరికి తెలిసిన విషయమే కానీ సాలెపురుగు పామును చంపడం ఎప్పుడైన విన్నారా.? సాలె పురుగులు పాముల్ని చెప్పడం ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారా.! నిజంగా సాలీడులు పాముకు విషమిచ్చి మరీ చంపేస్తున్నాయట. ఆ తర్వాత పాములని ద్రవరూపంలో మార్చేసి జుర్రేసుకుంటున్నాయి.ఇక తాజాగా సైన్టిస్టులు జరిపిన ఓ పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.పాములు పేరు వింటేనే మనుషులకు ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది.అవి కనిపిస్తే చాలు.. వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళరు. అంటార్కిటికా తప్ప ప్రపంచమంతా పాములు వున్న సంగతి తెలిసిందే.దాదాపు 2900 జాతులు పాముల్లో ఉన్నట్లు సైన్టిస్టులు గుర్తించారు.అందులో చాలావరకు విషపూరితమైనవి కాగా అవి ఒక్క కాటుతోనే ఏ జంతువునైనా గంటల్లో చంపేయగలవు.అయితే అంతటి విషపాముల్ని .. కేవలం ఒక్క కాటుతో విషమిచ్చి మరీ సాలెపురుగులు చంపి తింటున్నాయట. ఇక ఆ తర్వాత వాటిని ద్రవరూపంలో మార్చేసి జుర్రేసుకుంటూ తినేస్తున్నాయి.

విడోస్ స్పైడర్ లాంటి 90 జాతుల సాలెపురుగులు పాములను తినేస్తున్నట్లు స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ అఫ్ బేసెల్‌కు చెందిన సాలెపురుగు ఎక్స్‌పర్ట్‌ మార్టిన్‌ నీఫ్‌లర్‌ తెలిపారు. పాము, సాలెపురుగు మధ్య ఫైట్ జరిగితే  87 శాతం సాలెపురుగే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఇక సాలెపురుగులు , పాముల మధ్య జరిగిన 300 సంఘటనలు పరిశీలించిన నీఫలర్ ఆ ఘటనలలో గెలవని పాములు, ఎవరైనా వచ్చి రక్షిస్తేనే బతికిపోతాయని స్పష్టం చేశారు.థెరిడీడే జాతికి చెందిన సాలెపురుగు.. తాను తయారు చేసుకున్న సాలెగూళ్లలో భారీ కాయంతో ఉండే పాములు చిక్కుకుంటే వాటికి విషాన్ని ఎక్కిస్తుంది. దానితో ఆ పాములు దెబ్బకి పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి.తర్వాత ఆ పాము శరీర భాగాలను ద్రవ రూపంలో మార్చేసి స్పైడర్ తినేస్తుందని మార్టిన్ చెప్పుకొచ్చారు.నిజంగా అందరిని భయపెట్టే పాముల్ని స్పైడర్ లు చంపడం చాలా విచిత్రం కదూ.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: