
అమెరికా, యూరప్ దేశాలు ఆప్గాన్ దేశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. గల్ప్ దేశాలు తమ ఆఫీసులను దౌత్య కార్యాలయాల్ని అక్కడి నుంచి ఎత్తి వేస్తున్నాయి. మనం మాత్రమే వారికి సాయం చేస్తున్నాం. పక్క దేశం బాగుంటే మనకు ఏ అవసరమైన వచ్చినపుడు భూభాగ పరంగా కానీ ఇతర సాయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తాలిబాన్లు న్యూడిల్లీ నుంచి కాందహర్ కు విమానాలు నడపాలని తాలిబాన్లు కోరుతున్నారు. దుబాయ్ నుంచి విమానాలు నడుపుతున్నారు. మీరు కూడా విమానాలు ఆప్గాన్ కు నడపాలని తాలిబాన్లు కోరుతున్నారు.
తద్వారా భారత్, తాలిబాన్ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని అంటున్నారు. మరి భారత్ ఈ ప్రకటనపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఆర్థిక సంబంధాల వరకు ఓకే కానీ విమానాలు నడపడం ద్వారా భారత్ కు ఏమైనా ప్రమాదం పొంచి ఉందో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్గాన్ భారత్ నమ్మితే అది నష్టం కనక చేస్తే తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి. గతంలో కాందహర్ విమాన హైజక్ భారత్ కు గుర్తుకురావాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాలిబాన్లు మాట ఇవ్వాలి. మరి ఆప్గాన్, భారత్ మధ్య విమానాలు నడుస్తాయా? లేదా చూడాలి.