సుప్రీం కోర్టులో దాదాపు 89 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆ కోర్టు సమయాన్ని కూడా కొంతమంది కొన్ని కేసుల విషయంలో అప్పటికప్పుడు కోర్టును సమావేశపరచడం అది ఏటూ తేలకపోవడం లాంటి విషయాలు జరుగుతుంటాయి. తాజాగా సుప్రీం కోర్టు కేంద్రానికి, ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తి పార్లమెంట్ లో సభ్యుడైన అశ్విని ఉపాధ్యాయ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పదే పదే పిటిషన్లు వేస్తుంటారు.


అశ్విని ఉపాధ్యాయ్ ఆయన ప్రచారాన్ని కోరుకోవడానికి ఇష్టపడతారు. ఈయన రాజ్యసభలో ప్రశ్నలు అడగకుండా కేవలం కోర్టుల్లో కేసులు వేసి ఎక్కువగా ప్రచారాన్ని పొందేందుకు అలవాటు పడ్డారు. ఎక్కువగా నిజాయతీ పరుడిగా చూపించుకునేందుకు తహతహలాడుతారు. అశ్విని ఉపాధ్యాయ ఓ కేసులో ఒక ఉద్యోగికి ఏదైనా నేరం విషయంలో శిక్ష పడితే వారు ఆ ఉద్యోగానికి అర్హులు కారు. అలాంటి ఎన్నో కేసులు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని కేసు వేశారు.వెంటనే ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు సుప్రీం కోర్టు నోటీసులు అందజేసింది. ఏయే ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయో వారిని ఎలక్షన్ కమిషన్ ఎలా అనుమతించిందో తెలపాలని పేర్కొంది. అయితే ఇదే సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే ఏదైనా ఉద్యోగి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవిస్తే 6 ఏళ్ల పాటు ఆ ఉద్యోగానికి అనర్హులు అని తీర్పు ఇచ్చింది. అయిదేళ్లకు పైగా శిక్ష పడిన వారు శాశ్వతంగా అనర్హులు అవుతారని గతంలో తీర్పును వెలువరించింది.


ఒకసారి నేరారోపణలు ఎదుర్కొన్న వారు అనర్హులు అవుతారంటే అధికారంలో ఉన్న వారు అందరూ ప్రతిపక్షంలో ఉన్న వారిపై కేసులు పెడతారు. దీంతో వారు పోటీ చేయడానికి అనర్హులుగా మిగిలిపోతారు. వెంటనే ప్రతిపక్షం అనేది ఉండదు కదా.. పూర్తిగా అధికార పక్షం చేతుల్లోకి వెళ్లిపోతుంది.. మరి ఇలాంటి విషయాల్లో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: