తామరాకు మీద నీటి బొట్టు లాంటిది దౌత్య విధానం. అమెరికా, రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పడంలో భారత్ దౌత్య విధానాలే కారణం. కేవలం పాకిస్థాన్, చైనా వల్ల కాస్త ఇబ్బంది ఉన్నా మిగతా దేశాలతో మాత్రం దౌత్య విధానాల్లో భారత్ మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. జపాన్ ప్రధాని కిషిడా ఈ మధ్య భారత్ కు వచ్చారు. అనంతరం ఉక్రెయిన్ దేశానికి వెళ్లారు. భారత్ జపాన్, యూరప్, అమెరికా దేశాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. కేవలం పాక్ తో తప్ప ఎక్కువ విభేదాలు ఏ దేశంతో లేవు. జపాన్ ప్రధాని కిషిడా భారత్ పర్యటన అనంతరం ఉక్రెయిన్ కు వెళ్లారు. వెంటనే రష్యా కోపం కట్టలు తెంచుకుంది.
 

అణు వార్ హెడ్ లను మోసుకుపోయే రష్యా యుద్ధ విమానాలు జపాన్ సముద్ర ప్రాంతం వరకు వెళ్లాయి. ఇప్పటి వరకు జపాన్ సముద్ర జలాల్లో చైనా సుంకోషి దీవులు మావే నంటూ రెచ్చగొట్టేది. మొన్నటి వరకు నార్త్ కొరియా కూడా జపాన్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అయితే ఉక్రెయిన్ తో యుద్ధంలో భారత్ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. తటస్థంగా ఉంటూ అమెరికాను కాదని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది.


రెండు దేశాలకు మద్దతు ఇవ్వకుండా తన దేశం గురించి ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ నిరూపించింది. కానీ ఇంతలా యుద్దం జరుగుతుంటే జపాన్ ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడంతో రష్యా ఆగ్రహం చెందింది. మేం అనుకుంటే క్షణాల్లో జపాన్ పై యుద్ధం చేస్తామనే హెచ్చరికలను డైరెక్టుగా పంపించింది. మొన్నటి వరకు నార్త్ కొరియా, చైనా తో సమస్యలు ఉండేవి. ఇప్పడు దీనికి తోడు రష్యా చేరింది. జపాన్ కు అమెరికా, దక్షిణ కొరియా దేశాలు తప్ప మరే దేశం మద్దతు ఇచ్చేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: