పాకిస్థాన్ సైన్యం  గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే సైన్యం చెప్పినట్లు రాజకీయ నాయకులు వినేవారు.  ప్రస్తుతం విదేశాల నుంచి పాక్ సైన్యానికి సపోర్టు తగ్గిపోయింది. ఉదాహరణకు చైనా మయన్మార్ సైనికులకు డబ్బులిచ్చి అక్కడ తమ ఆధిపత్యాన్ని చెలాయించుకుంటున్నారు. గతంలో పాక్ సైన్యానికి కూడా అమెరికా డబ్బులిచ్చి అనుకున్న నాయకుడిని నిలబెట్టడమో.. తాము అనుకున్న అధికారి ద్వారా పనులు చేయించుకోవడమో చేసేది. అయితే ప్రస్తుతం అమెరికా పాకిస్థాన్ సైన్యానికి డబ్బులు ఇవ్వడం మానేసింది. ఆ అవసరం కూడా లేదు.


ఎందుకంటే అమెరికాకు భారత్ కూడా ఇప్పుడు మిత్ర దేశం గా మారిపోయింది. దీంతో పాకిస్థాన్ సైన్యం తిరుగుబాటను తగ్గించుకుంది. అందుకే ఇప్పుడు పాకిస్థాన్ సైన్యం మీద ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడుతోంది. పాకిస్థాన్ ఆర్మి చీప్ మోస్ట్ పవర్ పుల్ మ్యాన్ గా ఉండేవారు. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానమంత్రికి పాక్ సైన్యం, ఆ సైన్యాధ్యక్షుడు భయపడినట్లు తెలుస్తోందని ఇమ్రాన్ ఖాన్ మండిపడుతున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాద్ షరీఫ్ ఒక వైపు పంజాబ్ లో ఎన్నికలు నిర్వహించనని చెబుతుంటే పాక్ సైన్యాధ్యక్షుడు ఏం చేస్తున్నారు.


నిద్రపోతున్నాడా అని తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకంటే పాక్ లో కేవలం ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీపైనే పాక్ సైన్యం కానీ పోలీసులు కానీ దాడులకు దిగుతున్నారు. మమ్మల్నే అరెస్టు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన పాక్ ఆర్మీ అధికారులను ప్రశ్నిస్తున్నారు.


అంటే ఇప్పటి వరకు పాక్ లో ఎన్ని ప్రభుత్వాలు పని చేసినా ఆర్మీకి ఉన్నంత పవర్ అధికార యంత్రంగానికి లేదనే తెలుస్తోంది. అయితే పాక్ లో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ముదిరి పాకాన పడింది. ప్రజలకు గోధుమపిండి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాక్ లో పరిస్థితులను ఎలా అదుపు చేయాలో తెలియక ప్రభుత్వం, సైన్యం ఇబ్బందులు పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: