ఎక్కడో దేశంలో ఏదో మూల ఒక తీవ్రవాద చర్య జరిగితేనో, మరో ఘాతకం జరిగితేనో ఇక్కడ మన వాళ్ళు దానిపై మాట్లాడుతుంటారు. మాట్లాడాలి. దాంట్లో తప్పు లేదు. ఎక్కడో ఉత్తరాఖండ్ లో జరిగిన దాని గురించి మన తెలంగాణలో కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇంకా మల్లారెడ్డి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దేశంలో జరిగే దారుణాల గురించి సానుభూతి చూపించడం, బాధపడటం వ్యాఖ్యానించడంలో తప్పులేదు.


తీవ్రవాదులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేశంలో, రాష్ట్రంలో వాళ్ళ మత దేశాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యువతని చెడగొట్టి మతం మౌఢ్యులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్లని ప్రపంచ నాశనానికి తయారు చేస్తూ ఉంటారు. ఇది ఆషా మాషీ విషయం కాదు. చాలా సీరియస్ ఇష్యూ. అలాంటి ఘాతకానికి ప్రణాళికలు రచించిన తీవ్రవాదులను ఎక్కడో మధ్యప్రదేశ్ నుండి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.


ఇంటిలిజెన్స్ శాఖ పర్యవేక్షణలో ఇదంతా, ఈ అరెస్టు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఒక్క ప్రకటనా లేదు. ఒక్క సీరియస్ ప్రకటన కూడా లేదు హోం మంత్రి ఒక ప్రకటన చేసి వదిలేసిన ప్రసక్తి మాత్రమే ఉంది. ఎవరైతే హిజ్ హుద్ తహ్రిద్ గురించి బయటపడుతున్న అంశాలకు సంబంధించి ఆటో డ్రైవర్ గా చేసినటువంటి మహమ్మద్ అబ్బాస్ అలియాస్ భస్క వేణు కుమార్, రంగారెడ్డి జిల్లా జగద్గిరి గుట్ట మక్తుం నగర్ కు సంబంధించిన మహమ్మద్ హమీద్, మేడ్చల్ జిల్లా  జవహర్ నగర్ లోని శివాజీ నగర్ సంబంధించిన మహమ్మ ద్ సల్మాన్ తో కలిసి చేసిన ఈ కార్యకలాపాలకం సంబంధించి మరికొందరి అరెస్టులు జరిగాయి.


వీటన్నిటి తర్వాత కూడా ఈ రోజు వరకూ కూడా ఏమాత్రం ప్రణాళిక లేకపోవడం హిందువుల పేరుతో హై ప్రొఫైల్స్ ఉద్యోగాలు చేస్తున్నట్లుగా నమ్మబలికి  చేసినటువంటి ఘాతకాలకు సంబంధించి ఏమాత్రం ప్రకటించకపోవడం ఏమాత్రం లోతుగా ఎంక్వయిరీ చేయకపోవడం ఏంటి  అని కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: