ప్రస్తుత కాలంలో చాలావరకు ఉన్న ఉద్యోగాలకే గ్యారెంటీ లేదు. మరొక కొత్త ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కూడా లేదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక వారు పడే అవస్థలు మామూలువి కాదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి సమయంలో ఒక చిన్నదో.. పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేసి ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ క్రమంలోనే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లయితే ఇంటి వద్దనే ఉండాలనుకునే మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి.

అదే పేపర్ ప్లేట్ తయారీ బిజినెస్.. ఈరోజుల్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే భోజనాలు తప్పకుండా ఉంటాయి.. అందుకు తప్పనిసరిగా ప్లేట్స్ కావాలి. తక్కువ ఖర్చుతో  ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారాలలో ఇది కూడా ఒకటి. గృహిణులు నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని చాలా చక్కగా సులభంగా చేయవచ్చు.  ఈ వ్యాపారం చేయడానికి మొదట్లో కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది.  అయితే మీకు పని అలవాటు పడితే పెద్దగా ఇబ్బంది అనిపించదు.  అంతే కాదు పెట్టుబడి కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం ఉండదు.

ఇక ఇందులో లాభాల విషయానికొస్తే.. ముందుగా మీరు పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి మిషన్ కొనుగోలు చేయాలి. ఇందులో మూడు రకాలు ఉంటాయి.. మొదటిది మాన్యువల్ మేకింగ్ మిషన్ కేవలం రూ.20,000 వరకు ఉంటుంది. రెండవది సెమీ ఆటోమేటిక్ మిషన్ దీని విలువ రూ.40,000 వరకు ఉంటుంది . మూడవది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్.. దీని విలువ సుమారుగా లక్ష రూపాయల వరకు ఉంటుంది. రోజుకు 8:00 గంటలు పని చేస్తే 8,000 పేపర్ ప్లేట్స్ తయారు చేయవచ్చు. ఒక్కో ప్లేటు పై అన్ని ఖర్చులు పోయి 15 పైసలు మిగిలినా రోజుకు 1200 రూపాయలు మిగులుతాయి . ఇంతకంటే ఆదాయం మరే బిజినెస్ అందించదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: