కొంతమంది హీరోయిన్ లకు ఎలాంటి ప్రయత్నం లేకుండానే సినిమా అవకాశాలు విరివిగా వస్తూ ఉంటాయి. ఫ్లాప్స్ ఉన్నా అవకాశాలు అందుకోవడం అనేది వారి అదృష్టం. అయితే ఇంకొందరు మంచి విజయాలు అందుకున్న కూడా అవకాశాల వేట కొనసాగించిన కూడా ఏమాత్రం అవకాశాలు రావడం జరగదు. ఇలాంటి సందర్భంలో ఎంతో మంది హీరోయిన్ లు తమ కెరియర్ను కోల్పోవాల్సి వచ్చింది. అలా ఈ జాబితాలోకి చేరుతున్న మరొక హీరోయిన్ ప్రియాంక మోహనన్. తెలుగులో ఒకటి రెండు సినిమాలు తీసినప్పటికీ ఎక్కువగా డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ ముద్దుగుమ్మ. అలా ఆమె నటించిన తొలి సినిమాతోనే ఈమెకు మంచి హీరోయిన్ అయ్యే అవకాశం కలుగుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అందుకు భిన్నంగా మేకర్స్ ఆలోచించడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమా తోనే ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన అంతకుముందు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పరిచయం అయ్యింది. ఆ విధంగా మంచి క్రేజీ ఉన్న కూడా పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం ఆమెకు రావడం లేదని చెప్పాలి.

ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలలో రెండవ హీరోయిన్ ఛాన్సుల కోసం ఈ ముద్దుగుమ్మను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. మేకర్స్ ఇలా ఆలోచించడం మంచి విషయమే అయినా ఈ అమ్మాయి మాత్రం అలాంటి పాత్రలు ఒప్పుకునే విధంగా కనిపించడం లేదు. ఇప్పటికే అలా వచ్చిన చాలా అవకాశాలు ఆమె రిజెక్ట్ చేసిందని అంటున్నారు. మరి పెద్ద అవకాశాలు అందుకొని క్రేజీ హీరోయిన్ గా మారాలంటే ఏం చేస్తుందో చూడాలి. మరి ఆమె నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్న సినిమాలే. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మకు ఈ బ్యాడ్ లక్ ఎప్పుడు పోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: