
వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడంతో ప్లాపులు లేని డైరెక్టర్ గా.. ఓటమెరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆలోచనతోనే కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కించారు. అందులో మెగా స్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడం జరిగింది. అయితే వీరిద్దరూ మొదటిసారి ఫుల్ లెన్త్ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ సినిమా విజయవంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో బెడిసి కొట్టింది . ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత దర్శకుడితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా కొరటాల శివ తప్పు వల్లే సినిమా డిజాస్టర్ అయిందని చెప్పారు.
తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించినప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా భయపడ్డారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మీడియాకు అలాగే అభిమానులకు కొరటాల శివ భయపడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రకటించి దాదాపు 6 నెలలు కావస్తున్నా ఇంకా సినిమా సెట్ పైకి వెళ్లలేదు. పైగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు రావడానికి కొరటాల శివ భయపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు షూటింగ్ ప్రారంభానికి రెండు రోజులు ముందు కూడా మీడియాను ఎదుర్కోవడానికి సందేహించాడు. దీన్ని బట్టి చూస్తే ఏదో తీవ్రంగా తప్పు జరుగుతోందని స్పష్టమవుతోంది.