ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలు, హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే నటీనటులు, దర్శకులు ఇలా ఎవరైనా సరే తమ చిత్రాలతో మంచి విజయాన్ని సాధించారు అంటే తమ తదుపరి చిత్రానికి భారీ స్థాయిలో డిమాండ్ చేస్తారన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కొంతమంది అత్యాశకు పోయి మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక దర్శకుడి అత్యాశ కారణంగా ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయారు.

శివ కార్తికేయన్ హీరోగా ఇటీవల తమిళ్, తెలుగు భాషల్లో వచ్చిన చిత్రం డాన్.. ఈ సినిమాకి డైరెక్టర్ సిబి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా భారీ రేంజ్ లో విజయాన్ని అందుకుంది. దీంతో అటు శివ కార్తికేయన్ కు ఇటు డైరెక్టర్ సిబి కి కూడా భారీ పాపులారిటీ లభించిందని చెప్పాలి. ఈ క్రమంలోనే డైరెక్టర్ సిబి రజినీకాంత్ తో సినిమా చేయబోతున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకి అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు.


కానీ డాన్ సినిమాతో క్రేజ్ పెంచుకున్న దర్శకుడు సిబి రజనీకాంత్ తో సినిమా చేయాలి అంటే రూ. 15 కోట్ల పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేశారట.  అయితే ఒక్క సినిమాతోనే క్రేజ్ పెంచుకున్న ఈయనకి అంత డబ్బు ఇవ్వలేమని లైకా ప్రొడక్షన్స్ వారు ఆ ప్రాజెక్టును రద్దు చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క సినిమా అందులోనూ పాత దర్శకుడు.. ఇన్ని డిమాండ్లు చేస్తే కష్టం అన్నట్లుగా వారు ఆయనను సినిమా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.  మరి ఆ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేస్తారా లేక మరో కొత్త డైరెక్టర్ తో ముందుకు వస్తారా అనేది లైకా వారి చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: