
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఫిక్సయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ అమిగోస్ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిన అని పిలుస్తోంది.. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమాలు రిలీజ్ కాకముందే తమ ఓటీటీ సినిమాలను ప్రకటిస్తున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కొన్ని వారాల తర్వాత అందులో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.
కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బిజినెస్ మాన్ గా, మంజునాథ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, మైకేల్ అనే గ్యాంగ్ స్టార్ ఇలా మూడు సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.. ఈ ముగ్గురు ఒకరికొకరు ఎదురైన తర్వాత.. జరిగే సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించారు.. అసలు ఈ ముగ్గురికి రక్తసంబంధం ఉందా ? లేక పోలికలు మాత్రమే ఉన్నాయా? అనేది ఈ సినిమా.. మొత్తానికైతే అమిగోస్ చిత్రంతో తన ఖాతా లో మరో విజయాన్ని వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతున్నాడు అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.