టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ ఆఖరుగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో దగ్గుపాటి రానా కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా వెంకటేష్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ వెబ్ సిరీస్ తో వెంకటేష్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ "సైంధవ్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ.ని ఈ దర్శకుడు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. తాజాగా ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ... నాని పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ... నాని పాత్రతో ఈ సినిమా కథ మలుపు తిరగనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: