తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి వాటిలో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు.

 ఈ సినిమాకు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో అరవింద స్వామి ...  ప్రియమణి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 అసలు విషయం లోకి వెళితే ...  నాగ చైతన్య తన తదుపరి మూవీ ని నాంది మరియు ఉగ్రం మూవీ లకు దర్శకత్వం వహించినటు వంటి విజయ్ కనకమెడల దర్శకత్వంలో చేయబోతున్నట్లు ... అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు విజయ్ మరియు అతని టీం నాగ చైతన్య తో ఒక సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ని రూపొందించేందుకు గాను కథను సిద్ధం చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే విజయ్ కనకమెడల తాజాగా దర్శకత్వం వహించిన ఉగ్రం మూవీ మే 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: