టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కృతి శెట్టి ఈ సినిమాలో చైతు సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ప్రియమణి , అరవింద స్వామి ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ తెలుగు లోనూ అటు తమిళ్ లోను వరస ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి గాను నైజాం ఏరియాలో 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 2.20 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.2 కోట్లు , ఓవర్ సీస్ లో 2.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు గానూ మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 21.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: