
పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఇద్దరు కలిసి బ్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ టైటిల్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ అని పేరు వేశారు. సో అఫీషియల్ గానే సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా మారాడని చెప్పొచ్చు. నిన్న మొన్నటిదాకా సాయి ధరం తేజ్ గా ఉన్న మెగా మేనల్లుడి పేరుని సాయి తేజ్ గా మార్చేశారు.
ఇక మీడియా అండ్ ఫ్యాన్స్ కూడా సాయి తేజ్ అనే పిలిచే అవకాశం ఉంది. సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న బ్రో సినిమా జూలై 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆల్రెడీ విరూపాక్ష హిట్ పడింది కాబట్టి సాయి తేజ్ కి ఈ సినిమా కచ్చితంగా హిట్ పడుతుందని చెప్పొచ్చు. తన పేరుని సాయి తేజ్ అని అనౌన్స్ చేస్తూ అఫీషియల్ గా చెప్పేశాడు. ఇక ఈ సినిమా తర్వాత సంపత్ నందితో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని టాక్. ఈ సినిమాలతో సాయి తేజ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మెగా హీరో ప్లానింగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.