ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌ డమ్‌ అనుభవిస్తోన్న టాలీవుడ్‌ హీరో ప్రభాస్ . అతని గత సినిమాలు కొంచెం నిరాశపర్చినా అభిమానం కొంత కూడా తగ్గలేదు.

పైగా ఇంకా రెట్టింపయ్యింది.  ప్రభాస్‌ మనసు కూడా చాలా విశాలమైనది. సాయం అడిగిన వారికి కాదనలేకుండా ఎప్పుడూ హెల్ప్‌ చేస్తాడు. ఇక అతిథి మర్యాదలు చేయడంలో ఆయన నిజంగా రాజే అని చెప్పవచ్చు.. షూటింగ్‌ ఉంటే యూనిట్‌ సభ్యులందరికీ ఇంటి నుంచి విందు భోజనాలు అయితే తెప్పిస్తుంటాడు. అందుకే అభిమానులందరూ ప్రభాస్‌ను డార్లింగ్ అని ముద్దుపేరుతో పిల్చుకుంటారటా ఇక ప్రభాస్‌ కూడా అభిమానులకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తాడు. ఫ్యాన్స్‌ను కలిసేందుకు ఎక్కువగా అయితే ఇష్టపడుతుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇందులో అభిమాని కోసం ప్రభాస్‌ చేసిన పని అందరినీ కూడా ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'నువ్వు దేవుడివి స్వామి' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారటా.

ఇందులో ప్రభాస్‌తో ఉన్న అభిమాని పేరు కన్నయ్య అలియాస్‌ రంజిత్‌. ప్రస్తుతం అతను మన మధ్య అయితే లేడు. క్యాన్సర్‌ కారణంగా కొన్నేళ్ల క్రితమే కన్నుమూశాడు. కాగా రంజిత్‌ కన్నుమూసే ముందు అతని ఆఖరి కోరికలు తీర్చాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారటా.. కుమారుడిని ఇష్టమైన ప్రాంతాలకు తీసుకెళ్లడం, ఇష్టమైన వంటకాలు చేసి పెట్టడం వంటివి చేశారు. అలాగే కన్నయ్యకు ప్రభాస్‌ అంటే ఎంతగానో ఇష్టం. అతనిని కలవాలని ఉన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడటా.. బిడ్డ ఆఖరి కోరిక తీర్చేందుకు అతని తల్లి.. డైరెక్టర్‌ పూరి సతీమణి లావణ్యకు ఫోన్‌ చేసి ఈ సంగతి తెలిపింది. ఆమె ఈ విషయాన్ని ప్రభాస్‌కు చేరవేయగా.. అభిమానిని కలిసేందుకు వెంటనే ఒప్పుకున్నాడటా.. అతనికి ఇష్టమైన వంటకంతో పాటు అతని కోరికగా అడగ్గా.. బాహుబలి లో వినియోగించిన ఏదైనా వస్తువు కానుకగా ఇవ్వాలని కూడా కన్నయ్య అడిగాడు. అలా అడిగిన వెంటనే అన్ని ఏర్పాట్లు చేశారట ప్రభాస్‌. కన్నయ్య, అతని తల్లిని కలిసిన ప్రభాస్.. కన్నయ్యకు ఇష్టమైన చికెన్ మంచూరియా తెప్పించి మరి ఇచ్చారట. అలాగే బహుబలి లో వినియోగించిన కత్తిని బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది.. వారితో చాలాసేపు మాట్లాడారట. అలా కుమారుడి కళ్లల్లో ఆనందం చూసిన తల్లి ఎంతో సంతోషించింది

మరింత సమాచారం తెలుసుకోండి: