పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు.. పవన్ నటిస్తున్న బ్రో సినిమాలో సాయి ధరంతేజ్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది చిత్ర బృందం. విడుదలకు ఇంకా సమయం ఉండంగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో లుక్ కూడా రివీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత సాయి ధరంతేజ్ కూడా కనిపించడం జరిగింది.


అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలిసి ఉన్నటువంటి ఒక పోస్టర్ ని సైతం చిత్ర బృందం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా విడుదల తేదీ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ గురించి ఒక చర్చ జరుగుతోంది. ఈ షూ దాదాపుగా లక్ష రూపాయలకు పైగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

కొంతమంది ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.. పవన్ కళ్యాణ్ ధరించిన షూ బాల్ మెయిన్ యూనికాన్ కంపెనీ షూ గా తెలుస్తోంది. ఈశువుల ప్రత్యేకత ఏమిటంటే 82% నైలాన్ 14% ఎలాస్టాన్.. నాలుగు శాతం తెర్మో ప్లాస్టిక్ వంటి వాటితో ఇష్యూ ని తయారు చేయడం జరిగిందట.. బ్లాక్ నేయిల్ కలర్ తో చేయబడ్డ ఈశు యొక్క ధర 1207 పౌండ్లు అన్నట్టుగా ఇంటర్నెట్లో చూపించడం జరుగుతుంది ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా లక్ష రూపాయలకు పైగా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ విషయం సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: