సిద్దు జొన్నలగడ్డ పేరు చెప్తే ఎవరు కూడా అస్సలు గుర్తు పట్టారు. డీజే టిల్లు తో ఇతడు బాగా ఫెమస్. సినిమా భారీ హిట్ కావడంతో అతడి పేరు మారుమోగి పోయింది.

సినిమా లో కామెడీ మరియు డైలాగ్స్ బాగా హైలెట్ అవ్వడం తో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేసారు. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించి షూటింగ్ చేస్తున్నారు. డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా సిద్దు మరియు నేహా శెట్టి హీరో హీరోయిన్స్ గా అయితే నటించారు. అయితే ఈ సినిమాకు మొదటి భాగానికి మాత్రమే విమల్ కృష్ణ డైరెక్టర్ రెండవ పార్ట్ మొదలవ్వగానే హీరోకు మరియు డైరెక్టర్ కి ఇగో సమస్యలు ఎక్కువ అయ్యాయని తెలుస్తుంది.దాంతో రెండవ భాగానికి డైరెక్టర్ మారిపోయాడని సమాచారం.

అయితే సిద్దు ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్ తో డైరెక్టర్ మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా పలుమార్లు మారుతూ వచ్చారని తెలుస్తుంది.మొదట్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని చెప్పిన టీమ్ ఆ తర్వాత మరొక నాలుగు హీరోయిన్స్ పేర్లు కూడా ఆలోచించింది. సిద్దు వ్యవహార శైలి కారణంగానే వారెవరు కూడా ఈ సినిమాలో నటించేందుకు అస్సలు ముందుకు రాలేదు. ఇక ఫైనల్ గా అనుపమ తోనే ఫిక్స్ అయ్యి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ కేవలం నటుడు మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో సినిమాలకు సంబందించిన ఈవెంట్స్ కి హోస్ట్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో అన్ని మంచి శకునములే అనే సినిమాకు సంబందించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా సిద్దు చేత చేయించారు. అతడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతుంది. అందుకే సిద్దు అయితే ఈ మూవీ కి ప్లస్ అని భావించి చిత్ర బృందం ఇలా సిద్దు చేత యాంకరింగ్ చేయించారు. ఇక అసలు సంగతి ఏమిటి అంటే ఈ ఇంటర్వ్యూ లో మాటల సందర్భంగా సిద్దు తాను నటించిన డీజే టిల్లు సినిమాలో అసలు స్టోరీ నే ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేసాడు. ఇంత మందికి నచ్చిన ఆ సినిమాకు కథ లేదు అని చెప్పడం తో ఆ ఇంటర్వ్యూ లో ఉన్న మిగతా వారు అంతా కూడా షాక్ కి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: