కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి అందరికి కూడా బాగా తెలుసు..జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారి లో చమ్మక్ చంద్ర కూడా ఒకడు,కుటుంబ ప్రధాన్య స్కిట్ లు తీస్తూ అందరిని కూడా కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా ఇష్టపడుతారు. ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో చెప్పి అందరి ఆదరాభిమానాలు కూడా పొందుతున్నాడు. అందుకే జబర్దస్త్ షో లో చంద్ర స్క్రిట్ కి మంచి రేటింగ్ కూడా ఉంది.. ఇప్పుడు చంద్ర షో నుంచి వెళ్ళిపోయాడు.. అయితే చంద్ర జబర్దస్త్ కు రాక ముందు ఎం చేసేవాడంటే…?

నిజాని కి చంద్ర ఇండస్ట్రీ కి రాకముందు హైదరాబాద్ లో కూలి పని చేసేవాడని సమాచారం.…అతని కుటుంబం విషయానికొస్తే కడు పేదరికం నుంచి వచ్చాడు చంద్ర.. చంద్ర తల్లి మిషన్ కుట్టేది.. తండ్రి కట్టెలు అమ్మేవాడు..ఆ తర్వాత తన అన్నలు వ్యవసాయం ను ప్రారంభించారు.. అప్పుడు సినిమాల్లో కి రావాలని ఎన్నో కష్టాలు  అయితే పడ్డాడు.. కూలి పని చేసి మిగిలినవి ఇంటికి పంపేవాడు.. ఇలా చాలా కష్ట పడి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు..

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చంద్ర తన గురించి ఆసక్తికర విషయాల ను అయితే పంచుకున్నారు.డ్యాన్స్ బాగా వచ్చు కాబట్టి ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ ను వేసేవాడిని. అలా కొంతకాలం డ్యాన్స్ ట్యూషన్స్ కూడా నేను నిర్వహించాను. అలా వచ్చిన డబ్బును ఫిలిం ఇనిస్టిట్యూట్‌ లో యాక్టింగ్ కోర్సు చేయడానికి నేను ఉపయోగించాను. కానీ మనీ సరిపోయేది కాదు. అప్పుడు విజయ్ అనే నటుడి ఇంట్లో వంట మనిషి గా కూడా పనిచేశాను అంటూ చెప్పుకొచ్చాడు చమ్మక్ చంద్ర…ఇప్పుడు మినిమమ్ ఒక్క షోకు ఆయన 2 లక్షలు తీసుకుంటున్నాడ ని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: