నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. బాలకృష్ణ ఆఖరుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందినటువంటి వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో నటించారు.

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా వీర సింహా రెడ్డి లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న "భగవంతు కేసరి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను ఈ నెల 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ... బాబీ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి కోన వెంకట్ కథను అందించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్.లో 109 వ రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ నెల నుండి ఈ చిత్ర బృందం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: