లోకంలో మనుషుల్ని మోసం చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ మోసపోయిన వారి మనస్సు ఎంత ఆవేదన చెందుతుందో, ఎంతలా నమ్మినందుకు వారికి ఈ దుస్దితి పట్టిందో ఛీటింగ్ చేసిన వారికి తెలియదు. బలహీనమైన నమ్మకం చాటునే, బలమైన మోసం ఉంటుంది.. ఇలాగే ఒక వెధవ చేసిన పనికి ముగ్గురి నిండు ప్రాణాలు బలవంతంగా పోయాయి.


ఆ వివరాలు చూస్తే.. ప్రొద్దుటూరుకు చెందిన ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి (55) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ స్థానిక వైఎంఆర్‌ కాలనీలో భార్య, కుమార్తెలు శ్వేత (22), సాయిప్రీతి (19)లతో నివసిస్తున్నాడు. అయితే పెద్ద కుమార్తె శ్వేతకు పెళ్లిచేయాలనే ఆలోచనతో ఉండగా, తాళ్లమాపురం నుండి ఒక సంబంధం రావడం, తాను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని ఆ వచ్చిన వెధవ చెప్పాడమే కాదు నెలకు రూ.80 వేల జీతం వస్తుందని కూడా తెలపడంతో వెనక ముందు విచారించకుండా, మంచి సంబంధం అని నమ్మిన ఆ తండ్రి రూ.20 లక్షల వరకు కట్నంగా అర్పించి కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాడట..


తర్వాత పెళ్లి చేసిన ఆ కూతురిని ఆనందంగా కాపురానికి పంపించాక గానీ ఆ దుర్మార్గుడు చేసిన మోసం బయట పడలేదు. పనిపాటలేని జులాయి గాడు నమ్మించి మోసం చేశాడని గ్రహించిన శ్వేత తిరిగి పుట్టింటికి వచ్చేసింది. ఇదే సమయంలో మీ కూతురిని కాపురానికి పంపాలంటూ దొంగ అల్లుడి గొడవ, మరోవైపు చూస్తూ చూస్తూ కూతురిని మోసగాడి చేతిలో పెట్టాననే బాధలో ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణవార్త విని ఇద్దరు కూతుళ్లు కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.


కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటన ఆడపిల్లలున్న తల్లిదండ్రుల మనసులను కలచి వేస్తుంది. ఇక భర్త, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంటి ఇల్లాలు విజయభారతీ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. కాగా ఈ ఘటనకు కారనం అయినా సురేశ్‌ కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. ఈ సంఘటన సమాజంలో రోజు రోజుకు మారుతున్న మనషుల మనస్తత్వాలకు అద్దం పడుతుంది. ఇలాంటి నివురుగప్పిన నిప్పులు చాలమందే లోకంలో ఉన్నారు.. అందుకే ఆడపిల్లలతో సహా వారిని కన్న వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: