
మాస్కోకు చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ కరోనా టీకాను అభివృద్ధి చేసింది. రష్యా ఆరోగ్యశాఖ ఆ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పుతిన్ ప్రకటించారు. కరోనా వైరస్ నుంచి శాశ్వత రోగనిరోధక శక్తిని ఈ టీకా అందిస్తున్నట్టు పేర్కొన్న పుతిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు పరీక్షల్లో తేలిందని స్పష్టం చేశారు. ప్రజలకు విడుదల చేసేందుకు కావాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్‌పై జరిపినట్టు పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు. త్వరలోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. ఇదిలాఉండగా, పంపిణీలో భాగంగా తొలుత ఈ టీకాను ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వైరస్ ప్రమాదం అధికంగా పొంచి ఉన్న వారికి అందివ్వనున్నట్టు సమాచారం.
కాగా, కరోనా టీకాను పుతిన్ కూతురికి ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలింది.టీకా ప్రయోగంలో భాగంగా తన కూతురు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తొలిసారి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి టెంపరేచర్ 38గా నమోదు అయ్యిందని, తర్వాత రోజు టెంపరేచర్ 37కు పడిపోయినట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు. కరోనా వైరస్ సోకిన ఓ యువతికి టీకాను ఇచ్చినట్లు పుతిన్ వెల్లిడించారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆమె శరీరంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. కానీ త్వరగానే సాధారణ స్థాయికి వచ్చిట్లు తెలిపారు.