
ఇటీవల జరిగిన వరుస ఉప ఎన్నికలలోనూ బీజేపీ బి ఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి రెండు ఉప ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. దానితో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుండి బి ఆర్ ఎస్ కు ప్రమాదం పొంచి ఉందని రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ను హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో బాగా బలపడుతోంది. ఇక అన్నింటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే తెరాస లో మంత్రిగా ఉండి కేసీఆర్ తో పొసగక రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఈటల రాజేందర్ ను బీజేపీ తెరాస పతనానికి వాడుకుంటుంది.
ఎందుకంటే దాదాపు చాలా కాలం తెరాస లో ఉన్న ఈటల రాజేందర్ కు కేసీఆర్ గురించి మరియు అతని రాజకీయ పరమైన వ్యూహరచనల గురించి అడుగడుగునా తెలిసి ఉంటుంది. అందుకే ఆ దిశగా తెలంగాణ బీజేపీ తమ ప్లాన్ లను అమలుచేయడానికి చూస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ నుండి బి ఆర్ ఎస్ మరియు కేసీఆర్ లకు ఎదురుదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీటిని కేసీఆర్ అండ్ కో ఏ విధంగా తిప్పికొడుతోంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది.