ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా గెలవాల్సిన నియోజకవర్గాలలో నెల్లూరు జిల్లా ఒకటి అని చెప్పాలి. ప్రస్తుతం ఈ జిల్లా రాజకీయాలు మంచి కాకా మీద ఉన్నాయి అని చెప్పాలి. గత కొంతకాలంగా అధికార పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరియు నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు ప్రత్యక్షముగానో లేదా పరోక్షముగానో జగన్ ను మరియు పాలనను విమరిస్తున్నారు. అయితే ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ... పదే పదే రిపీట్ అవుతుండడంతో ఇక తప్పదని భావించిన సీఎం జగన్ వీరిద్దరికీ తన స్టైల్ లో సమాధానం చెప్పాడు.

ఇప్పటికే ఆనంకు ఎమ్మెల్యే అన్న పేరు తప్ప ఏమీ మిగలకుండా చేశాడు జగన్. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా గత నెలరోజులకు ముందు కోటంరెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయానికి రప్పించుకుని మాట్లాడిన తర్వాత నుండి... శ్రీధర్ రెడ్డి లో మార్పు బాగా వచ్చిందని తెలుస్తోంది. అయితే రెండు రోజుల నుండి శ్రీధర్ రెడ్డి నుండి వినిపిస్తున్న ప్రకారం నా ఫోన్ ను టిప్స్ చేస్తున్నారన్న కొత్త విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. శ్రీధర్ రెడ్డి చెబుతున్న ప్రకారం అతనితో పాటుగా మరొక ఇద్దరి మంత్ర్హులా ఫోన్ లను కూడా ట్యాప్ చేస్తున్నారన్న సంచలన విషయాన్ని చెప్పడం ఇప్పుడు రాష్ట్రము అంతా హాట్ టాపిక్ అయింది.

ఇందుకు బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కోటంరెడ్డి చెబుతున్నట్లు అతను బయట పెట్టిన వాయిస్ రికార్డ్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినది కాదని... అది కేవలం విపిన్ రికార్డ్ అని గట్టిగ చెప్పారు. శ్రీధర్ రెడ్డి ముందుగానే టీడీపీలోకి వెళ్లాలని పక్క ప్లాన్ ప్రకారమే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న విషయాన్ని ముందుకు తీసుకువచ్చారని.. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని.. త్వరలోనే శ్రీధర్ రెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చి నిజం బయటపెడతామని ఛాలెంజ్ విసిరారు. మరి ఈ విషయంలో ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటపడుతాయి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: