ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఎంత కంపవ్వాలో అంతా అయిపోయింది. హత్య జరిగిన వెంటనే అనుమానితులను అదుపులోకి తీసుకునుంటే హంతకులు ఎవరు, హత్యకు కారణాలు ఏమిటనే విషయాన్ని నిజాయితీగా దర్యాప్తుచేసుంటే అన్నీ విషయాలు ఎప్పుడో బయటపడుండేవి. అలాకాకుండా రాజకీయలబ్దికి ప్రయత్నించబట్టే హత్యకాస్త రాజకీయంగా వివాదాస్పదమైపోయి చివరకు దర్యాప్తు మొత్తం కంపైపోయింది.





ఇపుడు తాజా పరిస్ధితి ఏమిటంటే ఎవరినో ఒకళ్ళని లేదా కొంతమందిపై హంతకులని ముద్రవేసేయాల్సిన పరిస్ధితి. ప్రస్తుత పరిస్ధితికి వివేకా కూతురు సునీత కూడా కారణమనే చెప్పాలి. తాజాగా అంటే శుక్రవారం చంచల్ గూడ జైల్లో ఉన్న ఎర్రగంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నించినట్లు జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పింది. ఎర్రగంగిరెడ్డంటే హత్యకేసులో ఏ1 నిందితుడు. తన తండ్రిని చంపిన వాళ్ళల్లో ఒకడైన గంగిరెడ్డిని కలవాల్సినంత అవసరం సునీతకు ఏమొచ్చింది ?





ఇప్పటికే వివేకాను మర్డర్ చేశాను అని చెప్పిన దస్తగిరిని సునీత రక్షిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒకవైపేమో తండ్రి హంతకులకు శిక్షపడేట్లు పోరాటం చేస్తానని చెబుతున్నారు. మరోవైపు వివేకాను తాను గొడ్డలితో ఎన్నిసార్లు నరికాను, ఎక్కడెక్కడ వేటు వేశానని చెప్పిన దస్తగిరి హ్యాపీగా బయటతిరుగుతుంటే సునీత ఏమాత్రం పట్టించుకోవటంలేదు. దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి కోర్టులో కేసు వేశారు. దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని కోరే హక్కు కృష్ణారెడ్డికి లేదని సునీత మరో కేసు వేయటమే విచిత్రం. అంటే దస్తగిరిని సునీత కాపాడుతున్నారనే విషయం అర్ధమవుతోంది.





ఈ గొడవ ఇలాగుండగానే గంగిరెడ్డిని కలవాలని ప్రయత్నించటం సంచలనంగా మారింది. సీబీఐ విచారణలో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి చెబితేనే తాము హత్యాస్ధలంలో ఆధారాలను చెరిపేశామని గతంలోనే గంగిరెడ్డి చెప్పారట. ఇపుడు దానికి విరుద్ధంగా చెప్పాలని  ఒత్తిడి చేయటానికే గంగిరెడ్డిని సునీత కలిసే ప్రయత్నంచేసినట్లు జగన్ మీడియా ఆరోపించింది. జాగ్రత్తగా చూస్తే ఆరోపణలో వాస్తవముందని అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.






మరింత సమాచారం తెలుసుకోండి: