రాజమండ్రిలో జరిగిన మహానాడులో మొదటివిడత మ్యానిఫెస్టో రిలీజ్ లో చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. మ్యానిఫెస్టోలో అమరావతి నిర్మాణం గురించి పెద్ద హామీనే ఉంటుందని అమరావతి జేఏసీ ముసుగులో ఆందోళనలు చేస్తున్న వారంతా ఎంతో ఆశించారు. అలాంటి వాళ్ళందరికీ చంద్రబాబు ఊహించని షాకిచ్చారు. మొదటివిడత మ్యానిఫెస్టోలో అసలు అమరావతి ఊసే కనబడలేదు.

నిజానికి అమరావతిని చంద్రబాబు ఎప్పుడో వదిలేశారు. ఈ విషయం అమరావతి జేఏసీ అని అదని ఇదనే ముసుగులో ఆందోళనలు చేస్తున్న వారికే ఇంకా అర్ధంకావటంలేదు. ఇళ్ళపట్టాల పంపిణీ ముందు కూడా జేఏసీ ముసుగులో కొందరు నానా రచ్చచేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకవైపు కొందరు అంత రచ్చచేస్తున్నా వాళ్ళకి మద్దతుగా చంద్రబాబు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. చంద్రబాబును వదిలేస్తే తమ్ముళ్ళు కనీసం వాళ్ళని మద్దతుగా ఒకగంటసేపు కూడా కూర్చోలేదు.

టీడీపీనే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీపార్టీ కూడా ఆందోళనలు చేస్తున్న వాళ్ళని గాలికొదిలేశాయి. కారణం ఏమిటంటే పేదలకు ఇస్తున్న పట్టాలను అడ్డుకుంటే ప్రతిపక్షాలకు మళ్ళీ పుట్టగతులుండవని బాగా తెలుసుకాబట్టే. అసలే రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనది. అందుకనే టీడీపీ న్యాయస్ధానాల్లో తెరవెనుక ఉండి పోరాటం చేసిందే కానీ ప్రత్యక్షంగా గ్రౌండ్ లోకి దిగలేదు. కోర్టుల్లో చేసిన పోరాటాలు వృధా అయిపోవటంతో చేసేదిలేక చేతులెత్తేసింది.

అందుకనే ఇపుడు మొదటివిడత మ్యానిఫెస్టోలో కూడా అమరావతి ప్రస్తావన కనీసమాత్రంగా కూడా లేదు. ఇపుడు అమరావతిగురించి మ్యానిఫెస్టోలో పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. మ్యానిఫెస్టోలో అమరావతికి మద్దతుగా  ప్రస్తావించి ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎందుకు దెబ్బతినాలని చంద్రబాబు ఆలోచించుంటారు. ఒకవేళ అధికారంలోకి  వస్తే అప్పుడు ఏమైనా చేయగలిగింది చేయచ్చు లేకపోతే అసలు ఇష్యూనే గాలికొదిలేస్తే సరిపోతుందని అనుకునుంటారు. అందుకనే అందరు ఎదురుచూసిన అమరావతి ఊసు అసలు మ్యానిఫెస్టోలో ఎక్కడా కనబడంది.

మరింత సమాచారం తెలుసుకోండి: