
అయితే తర్వాత జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ కు ఎక్కువగా ఆయుధాలు ఇస్తోంది మాత్రం జర్మనీనే. దీనికి కారణం కూడా అమెరికానే. నాటో లో కీలక దేశం జర్మన్ దీని ద్వారా ఆయుధాలను ఉక్రెయిన్ కు ఇప్పించడంలో అమెరికా సక్సెస్ సాధించింది. అయితే రష్యా లో ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోలేదు. కానీ జర్మన్ మాత్రం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. లేటెస్ట్ గా చూస్తే 3 శాతం ఎకానమీ దెబ్బతింది. కరెంట్ కోతలతో పరిశ్రమ రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
కంటిన్యూగా ఈ విధంగా కోతలు ఉండటంతో అక్కడ పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇలా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు జర్మన్ ఆర్థిక వ్యవస్థ లాభాల బాటలో పయనిస్తూ ఇతర యూరప్ దేశాలకు ఆదర్శవంతంగా ఉండేది. ఇప్పుడు ఆయిల్ ను వేరే దేశాల నుంచి ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసినా కూడా అది సరిపోవడం లేదు.