క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణం ఇప్పుడు రానే వచ్చింది.గత కొన్ని రోజులుగా కూడా ఎంతగానో ఊరిస్తూ వస్తోన్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ 2023 అనేది ఇప్పుడు ఆరంభమైంది.ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా మొదటి టెస్టు గురువారం నాడు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్ ఇంకా అలాగే శ్రీకర్ భరత్ లు అరంగేట్రం చేయనున్నారు. అయితే ఈ సంవత్సరం వరుస పెట్టి శతకాలు బాదుతున్న శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టడంపై మాత్రం క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.వన్డే, టి20ల్లో సూపర్ ఫామ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ ను ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టు కోసం టీమిండియా మేనేజ్ మెంట్ ఇక తుది జట్టులోకి తీసుకోలేదు.


అయితే అనూహ్యంగా ఫామ్ లో లేని కేఎల్ రాహుల్ కు మాత్రం ఇందులో అవకాశం దక్కింది.ఇదే ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం అవుతుంది. రాహుల్ ప్రస్తుతం ఏ ఫార్మాట్ లో కూడా సరైన ఫామ్ లో లేడు. అలాంటి ప్లేయర్ కోసం ఫామ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చకు భారత క్రికెట్ అభిమానులు తెరలేపారు.న్యూజిలాండ్ తో జరిగిన చివరి టి20లో శతకంతో చెలరేగిన శుబ్ మన్ గిల్ ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బ తీసేలా ఉందనే అనేక రకాల కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఇండియా ఫైనల్ కు చేరాలంటే ఈ సిరీస్ లో ఇండియా ఖచ్చితంగా కూడా 2-0 లేదా 3-1 తేడాతో మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. అప్పుడే ఇండియా జూన్ నెలలో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: