
మొన్నటికి మొన్న ఏకంగా సెల్ఫోన్ టవర్లను రైల్వే ట్రాక్లను చోరీ చేసిన ఘటనలు కూడా అందరిని అవ్వక్కయ్యేలా చేశాయి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన అయితే అంతకుమించి అనే రేంజ్ లోనే ఉంది అని చెప్పాలి. అర్థం రాత్రి స్మశానవాటికలోకి వెళ్ళిన దొంగలు అక్కడ ఇక తమ చేతివాటం చూపించారు. అదేంటి స్మశాన వాటికలోకి వెళ్లి దొంగలించడానికి ఏముంటుంది అనుకుంటున్నారు కదా.. శవాలను కాల్చే శివపేటికకు ఉండే గ్రిల్స్ ని దొంగలించారు కేటుగాళ్లు. ఈ ఘటన తాడేపల్లి మండలం పెనమాకలు జరిగింది. ఈ ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇలా 1,50,000 రూపాయల విలువైన ఐరన్ గ్రిల్స్ ని అపహరించుకుపోయారు దొంగలు. అయితే ఇలా గ్రిల్స్ ని దొంగలించడంతో మృతదేహానికి దహన సంస్కారాలు చేయాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్మశాన వాటిక నిర్వాహకులు చెబుతున్నారు. గ్రిల్స్ మీద మృతదేహాన్ని ఉంచి దహనం చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుందని.. ఇప్పుడు గ్రిల్స్ లేకపోవడంతో ఎక్కువ పుల్లలు పేర్చి దహన సంస్కారాలు చేయాల్సి వస్తుంది అని చెబుతున్నారు. అయితే తాడేపల్లి ప్రాంతంలో గంజాయి బ్యాచ్లు ఎక్కువయ్యాయని.. వారిలోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.