దాదాపుగా నాలుగు రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎంపికకు సంబంధించి ఇప్పుడు హైకోర్ట్ సీరియస్ అయిన నేపధ్యంలో ఎన్నికల సంఘం సీరియస్ గా అడుగులు వేస్తుంది. కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంకు తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య కౌన్సిల్ కార్యాలయంకు చేరుకున్న వైసిపి కౌన్సిలర్లు... టీడీపీ నేతలు అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి కౌన్సిల్ కార్యాలయంకు చేరుకున్న కౌన్సిలర్లు... ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కాసేపటి క్రితం ఎన్నికను రిటర్నింగ్ అధికారి మొదలుపెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ కూడా ఇక్కడికి చేరుకొని టీడీపీ వాళ్లకు అండగా ఉన్నారు. కొండపల్లిలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap