చంద్రబాబు పాదయాత్ర కంటే షర్మిల పాదయాత్ర, జగన్ పాదయాత్ర, ఇలా ఒకరి కంటే ఒకరికి ఎక్కువ క్రేజ్ వచ్చింది పాదయాత్రలతోనే.  పాదయాత్ర ల్లో బెస్ట్ అంటే ఎక్కువ మంది చెప్పేది వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. ఆయన చేసిన పాదయాత్రతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఒకసారి కాదు రెండు సార్లు విజయం సాధించింది. తద్వారా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఇలా పాదయాత్రలు పార్టీలను అధికారంలోకి తీసుకొస్తాయని నిరూపించారు వైఎస్.


అలాంటి పాదయాత్రల్లో వైఎస్ జగన్ రూటే సెపరేట్ గా నడిచింది. వృద్దులు, చిన్న పిల్లలు కనిపిస్తే చాలు జగన్ తల నిమిరి ముద్దు పెట్టేవారు. దీన్ని చాలా మంది సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. ఇవన్నీ చూసి ప్రజలు జగన్ కు ఓటేసి ఏపీకి సీఎం గా ఎన్నకున్నారు. పాదయాత్రలకు అంత పవర్ ఉంటుంది. ప్రస్తుతం నారా లోకేేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా సెల్పీ దిగడం ప్రారంభించారు. కనిపించిన ప్రతి ఒక్కరితో దాదాపు 1000 మందితో పాదయాత్ర చేయడం. లోకేశ్ 400 రోజులు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.


రోజుకు దాదాపు 1000 మందితో సెల్పీ తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా రోజు వెయ్యి మందితో సెల్పీ లక్ష్యంగా అభిమానులను సంపాదించుకోవాలని వారి ఆదరణ చూరగొనాలని కోరుకుంటున్నారు. అయితే ఒక సీఎం కొడుకు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో అనుకూల మీడియా ద్వారా ప్రచారం ఒక ఎత్తయితే, సెల్పీలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని దాచుకుని తమ అభిమాన నేతతో ఫోటో దిగాము. అని తీపిగుర్తుగా ఉంచుకుంటారు. ఒక వేళ సీఎం అయితే దాన్ని చూపించి ఆనందపరచడానికి అవసరం అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం, ఇలా అనేక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: