తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన తలపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. 

మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి "రంజితమే" అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ ను డిసెంబర్ 4 వ తేదీన సాయంత్రం  4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: