టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా వాల్తేరు వీరయ్య నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తోన్న ఈ మూవీకు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అందువల్ల ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, సాంగ్స్  ఇంకా పోస్టర్స్ పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.ఇక తెలుగు వారి పవిత్ర పండుగ సంక్రాతి పండగ పరుగెత్తుకుంటూ వస్తున్న వేళ.. రిలీజ్‌ డేట్ అనేది మరింత దగ్గరకొచ్చిన వేళ జాన్ 8 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అంటూ ఇటీవలే డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇక తాజాగా తన ఫ్యాన్స్ కోసం వారి ఎంటర్‌ టైన్మెంట్ కోసం ట్రైలర్ ని రిలీజ్ చేశారు.మెగా అభిమానులు ఇంకా అలాగే మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అని అంశాలు ఈ మూవీలో చాలా పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ మాస్ రోల్ లో కనిపించనున్నారు.


మాస్ రాజా రవితేజ కూడా మెగాస్టార్ కు గట్టి పోటీ ఇస్తూ తనదైన స్టైల్ లో నటించి ఎంతగానో ఆకట్టుకోనున్నారు.ఇక ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ అనేవి నెక్స్ట్ లెవల్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని ఇంకా వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కూడా కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు మంచి  రెస్పాన్స్ వచ్చింది.సినిమా అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇంకా వాల్తేరు వీరయ్య టైటిల్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: