యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'రామబాణం'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో వీరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో రామబాణం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపట్ల నిర్మించిన ఈ సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఇక ఈ ప్రెస్ మీట్ లో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ..' కథను నమ్మి ఈ సినిమాను చేశానని, కొన్ని సినిమాల్లో కంప్లీట్ సాడ్ లేదా కమర్షియల్ ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ రామబాణం లో ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ ఎమోషన్స్ సీన్స్ కూడా ఉంటాయి. 

నేనైతే ఈ సినిమాను బయట ఉన్న  ప్రపంచాన్ని రెండున్నర గంటలు మర్చి పోయేందుకు చూస్తానని చెప్పాడు గోపీచంద్. అంతేకాదు ఈ కథ విన్నప్పుడు కూడా తనకు అలాగే అనిపించిందని అందుకే కథను నమ్మి సినిమా చేశానని గోపీచంద్ చెప్పాడు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి స్పందిస్తూ..' ప్రస్తుతానికి అయితే ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు. ముందు ముందు ఏమైనా అవకాశం వస్తే చేస్తా. ఒకవేళ డబ్బింగ్ అవకాశం వచ్చినా చేస్తా' అంటూ గోపీచంద్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రాబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఈ వార్తలు పై స్పందించిన గోపీచంద్..' నేను పిలిస్తే ప్రభాస్ తప్పకుండా వస్తాడు. కానీ ఎంత ఫ్రెండ్ అయినా అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ని పిలువలేను అని చెబుతూ ఫైనల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, కుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసుకున్న రామబాణం రిలీజ్ తర్వాత ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: