దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి అయితే తెరలేపారు. గతం లో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై సైటిరికల్‌గా సినిమాలు చేసిన విషయం అందరికి తెలిసిందే.

ఆ మధ్య జగన్ బయోపిక్ కూడా సినిమాగా తెరకెక్కిస్తానని చెప్పి  కూడా అందరికి షాకిచ్చారు. గత కొంత కాలంగా ఆయన వైసీపీ కి అనుకులంగా మాట్లాడుతున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా జగన్ బయోపిక్‌ను "వ్యూహం" అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నారని తెలుస్తుంది . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో జగన్ భార్య భారతీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ ఫొటోల ద్వారా తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు.

ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ అనే యువతి నటిస్తోందని తెలుస్తుంది.."వ్యూహం" బయోపిక్ కాదని, బయోపిక్‌ను మించిన రియల్ పిక్ అని కూడా ఆర్జీవీ ప్రకటించారు. ఈ సినిమాలో చూపించేవన్నీ కూడా నిజాలే ఉంటాయని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. అయితే వర్మ రివిల్ చేసిన ఫొటోస్‌లో వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్ సీన్ ఫోటో షేర్ చేయడంతో రకరకాల కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. నెటిజన్ల పై రామ్ గోపాల్ వర్మ  కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యూహం అలాంటి సినిమా కాదు అంటూ కూడా వర్మ తెలిపే ప్రయత్నం చేసాడు. రాం గోపాల్ వర్మ తీసే సినిమాలు ఎలా వుంటాయో అందరికి తెలుసు. ఆ సినిమాలు రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకొని తీయడం చేస్తాడు. అలా వచ్చినవే లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర వంటి పొలిటికల్ చిత్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: