తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున ఆఖరుగా పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా ... కళ్యాణ్ కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించగా ... ఆయనకు జోడిగా కృతి శెట్టి ఈ మూవీ లో నటించింది. ఈ సినిమా తర్వాత ఈ హీరో ది ఘోస్ట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. పోయిన సంవత్సరం దసరా కానుకగా విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్న ది ఘోస్ట్ మూవీ తర్వాత నాగార్జున తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కొంత కాలం క్రితం ధమాకా మూవీ కి కథను అందించినటువంటి ప్రసన్న కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నాగార్జున నటించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.

కాకపోతే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయం సాధించినటువంటి "పోరింజు మరియాం జోజ్" అనే మూవీ ని తెలుగు లో నాగార్జున రీమిక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: