పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు. ఇక ఆయన నటించిన సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదల తేది దగ్గరకు వస్తుంది. ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో చాలా ఘనంగా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు చిత్రబంధం. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్ సాంగ్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయి. 

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటల గురించి మాట్లాడుకుంటే ముందుగా జైశ్రీరామ్ పాటని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ పాట మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఆ పాటె వినపడుతోంది. మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఈ పాట వేయగానే గ్రౌండ్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. తాజాగా ఈ సినిమాలోని రామ్ సీతారాం పాటకి కూడా ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. అలా ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి పాట మరియు ప్రమోషన్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 6వ తేదీన తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు చిత్ర బృందం. 

ఇక ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 200 మంది డాన్సర్లు 200 మంది సింగర్లు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరందరూ కూడా కలిసి డాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికత ఒట్టి పడేలా సెట్టింగ్స్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర బృందం దాదాపుగా రెండు నుండి మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే 3 బలగం లాంటి సినిమాలు తీసే రేంజ్ బడ్జెట్ అన్నమాట.ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు రైట్స్ ని 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది .ఇక అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: