నేడు శాసనసభలో  మాట్లాడుతూ.. రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం సరి కాదు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇక  సోమశిల-మర్రిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్‌ అసలు పట్టించుకోలేదు అని అన్నారు. ఈ ప్రాజెక్టు  ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో 5 వేల క్యూసెక్కుల నీటిని అందేచేయడం జరుగుతుంది అని రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు   భూసేకరణ సమస్యను కూడా  చంద్రబాబు  ప్రభుత్వం అసలు చూడలేదు అని అన్నారు . ఈ ప్రాజెక్టు విజయవంతం ఐతే మాత్రం 90 వేల ఎకరాలకు నీరు ప్రజలకు చేరుతుంది అని అన్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ పూర్తి చేసి  పూర్తి చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి  కోరడం జరిగింది.

 

మన మహానేత వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి అవ్వకుండా  మిగిలిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టును కూడా చేయలేదు అని ఆరోపణలు చేశారు. ఇక మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాజెక్టులను  పరిగణనలోకి తీసుకుని  పూర్తి చేయాలని సభలో  కోరడం జరిగింది.

 

మరో వైపు గత ప్రభుత్వం వేసిన రోడ్లలో నాణ్యత అసలు లేదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేసాడు. ఇక ఉపాధి హామీ పథకం నిధులను  అన్ని కూడా తెలుగు తమ్ముళ్లకు ఇచ్చారు అని  మండిపడం జరిగింది. గత ప్రభుత్వంలో టీడీపీ నుంచి పంచాయతీరాజ్‌ మంత్రిగా లోకేష్‌ ఉన్నారు అని మరోసారి గుర్తు చేయడం జరిగింది. ఇలా ఉపాధి నిధులను దుర్వినియోగంపై విచారణ జరిపించాలని జోగి రమేష్‌ డిమాండ్ చేయడం జరిగింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MLA' target='_blank' title='ఎమ్మెల్యే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎమ్మెల్యే</a> జోగి రమేష్‌ in assembly

 

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల రగడతో ప్రశ్నలను  సరిగా అడగడం లేదు అని అన్నారు. గతంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి చోటు  చేసుకుంది అని విమర్శించడం జరిగింది. ఇక రాజోలు నియోజకవర్గంలో భారీ అవినీతికి పాల్పడింది అని తెలిపారు. ఇక రాజోలులో రోడ్లు చాల దరిద్రంగా ఉన్నయి అని తెలిపారు. రాజోలు అభివృద్ధిపై  సీఎం దృష్టి పెట్టాలని కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: