
ఆయన వ్యవహారాల విషయంలో ఏసీబీ అధికారులు బాగా దృష్టి సారించారు. ప్రతీ ఒక్కటి కూడా ఆరా తీస్తున్నారు. దొరికిన వరకు దోచుకోవడమే ఆయన లక్ష్యంగా కనపడుతుంది. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఆయన భూ దందాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చూసి ఏసీబీ అధికారులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది అంటే అర్ధం చేసుకోవచ్చు. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై వస్తున్న మరి కొన్ని ఆరోపణలు ఆసక్తిగా ఉన్నాయి.
తూప్రాన్ మండలం కిష్టాపూర్ ,యావాపూర్ గ్రామాల శివారులో 32 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి డబ్బులు వసూలు చేసాడు. మొన్న వంద ఎకరాలకు ఇలాగే డిమాండ్ చేసాడు. మనోహరాబాద్ మండలం కుచారం, జీడిపల్లి లో స్వాతంత్ర సమరయోధులకు అందించిన భూములలోను ఎన్ ఓ సి లు ఇచ్చే విషయంలో లంచం డిమాండ్ చేసాడు. హైదర్ గూడ లో ఒక భూ వ్యవహారంలో మధ్య వర్తిత్వం వహించాడు. అదే విధంగా శివ్వంపేట మండలం సికింద్రాపూర్ లో వివాదాస్పద భూముల్లో కొందరి పేర్లను చేర్చాలని ఒత్తిడి చేసాడు నగేష్. కాని దానికి నిరాకరించారు రెవెన్యూ అధికారులు.