చూస్తుంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బ్యాడ్ టైం స్టార్టయినట్లే ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డితో నిత్య వైరం. ఇదే సమయంలో ఏపీ సీఐడీ విచారణను ఎదుర్కోవాల్సి రావటం. సీఐడీ పోలీసులపై కోర్టుల్లో కేసులువేసి పోరాటాలు చేస్తున్నారు. అలాగే జగన్ను ఎలాగైనా జైలుకు పంపాలన్న పట్టుదలతో కోర్టుల్లో పదేపదే కేసులు వేసి పోరాడుతున్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తాజాగా తెలంగాణాలో ఎంఎల్ఏల కొనుగోలు ఆరోపణలపై విచారిస్తున్న సిట్ అధికారులు రఘురాజుకు నోటీసులు పంపింది.
ఈనెల 26వ తేదీన హైదరాబాద్ లోని సిట్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులో చెప్పింది. విషయం ఏమిటంటే ఎంఎల్ఏల కొనుగోలులో ప్రక్రియలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్, రామచంద్రభారతికి అత్యంత దగ్గరి సంబంధాలున్నాయని బయటపడింది. బహుశా వీళ్ళని విచారించినపుడు వీళ్ళిద్దరిలో ఎవరి ద్వారానో కొనుగోళ్ళ కేసులో ఎంపీ పాత్ర బయటపడినట్లుంది. అందుకనే నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా  సిట్ రఘురాజుకు కూడా నోటీసులిచ్చింది.

మరి రఘురాజు విచారణకు హాజరవుతారా లేకపోతే కోర్టునుండి స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ విచారణకు హాజరైతే నిందితులతో తనకున్న సన్నిహిత సంబంధాలపై  ఏమిచెబుతారో చూడాలి. విచారణకు హాజరైన ఎంపీని మరింతలోతుగా విచారించే ఉద్దేశ్యంతో ఎంపీని సిట్ అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఎంపీ కష్టాల్లో పడినట్లే.


ఇప్పటికే ఏపీసీఐడీ విచారణలో ఒకసారి నరకం చూశానంటు తర్వాత ఎంపీ గగ్గోలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన కూడా ఎంపీ పెద్దఎత్తున న్యాయపోరాటం చేస్తున్నారు. విచారణపేరుతో తనను పిలిపించి ఏ విధంగా విచారణ చేస్తారో అనేభయం ఎంపీలో పెరిగిపోతోంది. అందుకనే అసలు విచారణే జరపకూడదన్నట్లుగా కోర్టుల్లో స్టే కోసం పోరాడుతున్నారు. మరి తాజా నోటీసులపై ఎంపీ ఏ విధంగా స్పందించబోతున్నారో చూడాల్సిందే.  టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోళ్ళ వ్యవహారంలో ఎంపీ పాత్రగనుక బయటపడితే రఘురాజు కత గోవిందానే. ఎందుకంటే తన ఎంఎల్ఏల కొనుగోళ్ళకు పాల్పడినవారి అంతు చూడాలని కేసీయార్ మహాపట్టుదలగా ఉన్నారు. కాబట్టి రాజుగారి చాప్టర్ క్లోజ్ అనే అనుకోవాలి.మరింత సమాచారం తెలుసుకోండి: