జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండురోజులు ఢిల్లీలో ఎందుకు ఉన్నారో నాదెండ్ల మనోహర్ చెప్పేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించటమే అసలు అజెండా అట. మరి టార్గెట్ రీచయ్యారా ? అంటే లేదు ఫెయిలయ్యారనే అనుకోవాలి. ఎందుకంటే పవన్, నాదెండ్లకు మించిన తెలివైన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు.  పవన్, నాదెండ్ల లాంటి వాళ్ళని నరేంద్రమోడీ, అమిత్ షా ఎన్నివేలమందిని చూసుంటారు. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మోడీకి తెలీదా ?  పవన్ ఢిల్లీ ఉద్దేశ్యం తెలుసుకాబట్టే అమిత్ షా అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు.





రెండురోజులు క్యాంపులో ఎన్నో ప్రయత్నాల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవగలిగారు. సమావేశంలో చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవాలని పవన్ అడిగితే నడ్డా ఏమీ సమాధానం చెప్పలేదని సమాచారం. ముందు కర్నాటక ఎన్నికల్లో ప్రచారానికి రావాలని  నడ్డా అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీతో పొత్తు విషయమై ఏమీ చెప్పకపోవటంతో కర్నాటకలో ప్రచారం విషయంపై పవన్ ఏమీ చేప్పకుండానే తిరిగొచ్చేశారట. నిజానికి చంద్రబాబుతో బీజేపీ పొత్తుపెట్టుకోవాలని అనుకుంటే మధ్యలో పవన్ అవసరమే లేదు.  





తన ప్రతిపాదనకు నడ్డా గనుక ఓకే చెప్పున్నా లేదా సానుకూలంగా స్పందించున్నా పవన్ బాడీ ల్యాంగ్వేజ్ మరోరకంగా ఉండేది. ఆకాశమేహద్దుగా రెచ్చిపోయుండే వారనటంలో సందేహంలేదు. అందరికీ కనబడింది ఇదైతే నాదెండ్ల మాత్రం ఢిల్లీ టూర్ బ్రహ్మండమని చెప్పుకుంటున్నారు. వైసీపీ విముక్త ఏపీ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారని నాదెండ్ల చెప్పుకుంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాదెండ్ల చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. రోడ్డుమ్యాపు వచ్చేస్తుందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.





రెండేళ్ళుగా రోడ్డుమ్యాప్ కావాలని పవన్ అడుగుతునే ఉన్నారు, బీజేపీ ఇస్తునే ఉంది. వైజాగ్ టూర్ కు వచ్చినపుడు పవన్ తో  నరేంద్రమోడీ మాట్లాడుతు రోడ్డూ లేదు మ్యాపులేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండటమే రోడ్డుమ్యాప్ అని తేల్చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. బీజేపీతో కలిసి ఆందోళనలు చేయమని మోడీ చెబితే ఇప్పటివరకు ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. పైగా ఇప్పటికే పవన్ పై బీజేపీ నేతలు చాలా ఫిర్యాదులు చేసున్నారు. అందుకనే పవన్ను ఢిల్లీలో పెద్దగా లెక్కచేయలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: