నిన్న అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే . టేక్ ఆఫ్ అయినకొద్ది నిమిషాలకి లండన్ వెళ్లాల్సిన విమానం కుప్పకూలిపోయింది . ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు . కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు . ఇప్పటికే 186 మంది వరకు మృతి దేహాలను వెలికి తీశారు . అయితే విమాన ప్రమాదంలో చహ్నిపోయిన వారికి పరిహారం ఎంత అవ్స్తుంది..? ఎవరు ఇస్తారు..? చనిపోయిన వెంటనే పరి హారం ఇస్తారా..? లేకపోతే దానికి ఏవైన కండీషన్స్ ఉన్నాయా..? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!


మాంట్రియాల్ కన్వెన్షన్ ఒప్పందం:

ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాలపై  మాంట్రియాల్ కన్వెన్షన్ 1999  కింద ఒక్క  ఒప్పందం కుదిరింది . దీని ప్రకారం చూస్తే ఒక్కొక్క ప్రయాణికుడికి దాదాపు 1.4 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.   అదేవిధంగా విమానయా సంస్థ నిర్లక్ష్యం అని తెలిస్తే మాత్రం ఇంకా అదనంగా పరిహారం చెల్లిస్తారు . ఇక్కడ కండిషన్ ఏంటంటే అంతర్జాతీయ ప్రయాణాలపై మాత్రమే ఇది వర్తిస్తుంది.



ట్రావెల్ ఇన్సూరెన్స్ :

విమాన ప్రయాణికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా కీలకం.  ఈ పాలసీల ద్వారా ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వారికి సుమారు 25 లక్షల నుంచి దాదాపు కోటి రూపాయల వరకు వస్తుంది . ఒకవేళ శాశ్వతంగా వికలాంగత కలిగిన వారికి ఐదు నుంచి పది లక్షల వరకు పరిహారం లభించవచ్చు . అదేవిధంగా హాస్పిటలైజేషన్స్ అలాగే లగేజ్ పోవడం.. విమానం ఆలస్యం గా రావడం లాంటి సందర్భాలలో కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ లు పరిహారం ఇస్తాయి. ఎయిర్లైన్స్ నుంచి చట్టపరంగా ఇచ్చే పరిహారం కచ్చితంగా అందుతుంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం కూడా అలాంటి వాళ్లకు ఎక్స్ గ్రేసియా అందిస్తూ ఉంటుంది . అది అదనపుగా వచ్చే డబ్బు.



పరిహారం డబ్బులు ఎప్పుడు ఇస్తారు:

చాలా విమాన ప్రమాదాల సమయంలో ప్రభుత్వం దాదాపు పరిహారం ప్రకటించదు. చాలా అరుదుగా మాత్రమే పరిహారం ప్రభుత్వం ఇస్తుంది.  విమాన ప్రమాదం తర్వాత పలుసార్లు వెంటనే పరిహారం రాదు.  ప్రమాదంపై సరైన దర్యాప్తు చేసి అందులో తప్పు ఎవరిది..? బాధ్యత ఎవరిది..? అనే విషయం స్పష్టంగా తెలిసిన తర్వాతే ప్రయాణికుడి కుటుంబాలకు డబ్బు అందుతుంది.  అంతేకాదు ఇక్కడ నామిని ఎవరు రాశారు ఆ ప్రయాణికుడు అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది .



కండీషన్స్ ఏంటి?

విమాన ప్రయాణికులు తమ ప్రయాణం సమయంలో తప్పనిసరిగా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారానే ఇది లభిస్తుంది. పాలసీలో నామిని వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి. అలాగే ప్రింటెడ్ డిజిటల్ భీమా కాపీలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. భీమా ప్లాన్స్ సరైనది ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా మరణంతో పాటు  వైద్యానికి ఖర్చు అయిన డబ్బులు కూడా లభించే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లైట్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి . ఇన్సూరెన్స్ తీసుకొని వారికి ఇలాంటివి అసలు ఏవి వర్తించవు. చాలామంది ఇండియన్స్ విమాన ప్రయాణాలు చేసే సమయంలో ఇన్సూరెన్స్లు తీసుకోవడానికి ఇష్టపడరు . ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే .. అలాంటి వారికి కేవలం విమాన కంపెనీ అందించే పరిహారం మాత్రమే వర్తిస్తుంది. ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ (కంపెనీ తరఫున బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే వారికి మాత్రమే ఇది వస్తుంది). క్రెడిట్ కార్డ్ లింక్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ( ఒకవేళ కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసినట్లయితే మాత్రమే) ఇది వర్తిస్తుంది..!



నిజానికి బస్సు - రైలు - విమాన ప్రయాణాలు అన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ అందిస్తాయి.  కానీ ఎందుకో ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయాణికులు ఇష్టపడరు . కొందరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న కూడా అందులో నామినేట్ డీటెయిల్స్ ని సరిగ్గా నింపారు . అది చాలా చాలా మిస్టేక్ అంటున్నారు నిపుణులు. అలా ఎప్పుడూ చేయకూడదు అని సూచిస్తున్నారు . డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ ప్రయాణాలు అయినా తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలి . నామిని డీటెయిల్స్ నింపాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: