బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాక్ షో దీపావళి పండుగ సందర్భంగా ప్రసారం అవుతోంది. ఇక మొదటి ఎపిసోడ్ లో బాలయ్య అదరగొడుతున్నారు. ప్రోమో వచ్చిన నాటి నుండే బాలయ్య టాక్ షో పై ఎన్నో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య సినిమాల కంటే ఈ టాక్ షో ప్రోమో లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు అని ప్రశంసలు అందుతున్నాయి. ఇక ప్రోమోలో బాలయ్య అడిగిన ప్రశ్నలు మోహన్ బాబు ఇచ్చిన సమాధానాలు మరింత ఆసక్తిని పెంచాయి. 

ప్రస్తుతం షో ప్రసారం అవుతుండడంతో బాలయ్య అభిమానులంతా టీవీ లకే అతుక్కుపోయారు.  షోలో చిరంజీవితో మోహన్ బాబుకు ఉన్న విభేదాల గురించి బాలయ్య రాబట్టాలని చూసారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మీద మోహన్ బాబుకు ఎలాంటి అభిప్రాయం ఉంది అంటూ ప్రశ్నించారు. దాంతో మోహన్ బాబు చిరంజీవి మంచి నటుడు మంచి డాన్సర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల మా ఎన్నికల నేపథ్యంలో మరోసారి చిరు మోహన్ బాబుల మధ్య సైలెంట్ వార్ నడిచిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: