అధికార పార్టీ నేతలు క్యాసినీలు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు..ఇదీ కొంతకాలంగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు.. గతంలో గుడివాడలో క్యాసినో పేరిట ఎంత రచ్చ జరిగిందో గుర్తుంది కదా.. గుడివాడను కొడాలి నాని క్యాసినో రాజధానిగా మారుస్తున్నారని విమర్శలు వచ్చాయి. టీడీపీ నిజనిర్థారణ కమిటీ పేరుతో అక్కడికి వెళ్లడం..అక్కడ రచ్చ రచ్చ జరగడం తెలిసిందే.


ఇప్పుడు మరోసారి అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఈ విషయంలో డీజీపీకి టీడీపీ  నేత వర్ల రామయ్య లేఖ రాశారు. క్యాసినో నిర్వహణకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కంకిపాడులో క్యాసినో నిర్వహణకు కొందరు యత్నించారన్న వర్ల రామయ్య.. రాష్ట్రంలో కొందరు జూదం, క్యాసినోను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గతంలో కొడాలి నాని నిర్వహించిన క్యాసినోపై ఇప్పటికీ చర్యలు లేవన్న వర్ల రామయ్య.. గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: