ఏంటో.. ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మానవత్వం ఉన్న మనిషి మృగంలా మారిపోతున్నాడు అని అర్థమవుతుంది. జాలి దయ కరుణలకు కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో ఇక ఇప్పుడు అవే కరువవుతున్నాయి అనేది తెలుస్తుంది. అడవిలో జీవించే మృగాలు అయినా కాస్తంత జాలి దయతో వ్యవహరిస్తాయేమో కానీ సభ్యసమాజంలో బ్రతుకుతున్న మనిషి మాత్రం రాక్షసత్వం తో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు.అది కూడా చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్నారు. హత్యకు పాల్పడితే శిక్షలు పడతాయని భయం ఎవరిలో కనిపించడం లేదు.


 దీంతో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఏదో చాక్లెట్ తిన్నంత  సులభంగా ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.. ఇక వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సహోద్యోగి పై కక్ష పెంచుకున్న వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో వెలుగులోకి వచ్చింది..


 ఆటోమొబైల్ అనుబంధ సంస్థ లో మిషన్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉన్నాడు సందీప్ అనే వ్యక్తి.. అయితే తన పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు అనే కారణంతో సీనియర్ ఉద్యోగి అయిన ప్రమోద్ పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా పగ తీర్చు కోవాలని అనుకొన్నాడు. ఇక ఇటీవలే మందు పార్టీ ఉంది రమ్మంటూ సీనియర్ ఉద్యోగి ప్రమోద్ ను ఇంటికి పిలిపించుకున్నాడు.. ఫుల్లుగా మద్యం తాగించి అతను మత్తులో ఉన్నప్పుడు దారుణంగా కత్తితో తల నరికేశాడు. అంతేకాదు ఆ తర్వాత రాక్షస ఆనందాన్ని పొందుతూ మొండెం పక్కనే నిద్రించాడు. తర్వాత రోజు ఉదయం తలను ఒక సంచిలో చుట్టి చెత్త కుప్పలో విసిరేసాడు. 300 కిలోమీటర్ల దూరంలో ఇక ప్రమోద్ మృతదేహాన్ని పడేసాడు. భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: