
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆ మహిళకు పెళ్లయింది. కానీ భర్తను కాదని పరాయి వ్యక్తుల మోజులో పడి పోయింది. ఇక అతని మాయలో ఎంతలా మునిగి పోయింది అంటే ఏకంగా మొగుడిని విడిచిపెట్టి లవర్‌తో వెళ్ళిపోయెంతగా అక్రమ సంబంధాన్ని పెంచుకుంది. కానీ ఈ అక్రమ సంబంధమే చివరికి ఆమెను నేరస్తు రాలిని చేసింది. కొన్నాళ్ల పాటు ఆమెతో రాసలీలలు కొనసాగించిన ప్రియుడు ఆమెతో పెళ్లి అనేసరికి ముఖం చాటేశాడు. ఇంకేముంది ఆమె ఉన్మాదిగా మారి పోయింది. ఇప్పటివరకు ప్రేమించిన ప్రియుడిని గొంతు కోసి దారుణంగా ఖతం చేసింది. ఇక డెడ్‌బాడీని మాయం చేసేందుకు ప్లాన్ వేసింది. కానీ చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయింది ఆ మహిళ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరికి విచారణ ప్రారంభించారు. అయితే సదరు మహిళ చేతిలో చనిపోయిన వ్యక్తిని సింబల్ ఏరియాకు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తి గా నిర్ధారించారూ పోలీసులు. ప్రీతీ శర్మ అనే మహిళను హస్బెండ్ వదిలేసింది. ఈ క్రమంలోనే ఫిరోజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా అతనితో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తూ ఉంది. ఇటీవలే తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. కానీ అందుకు మాత్రం అతను అంగీకరించలేదు. దీంతో ప్రియుడిని హత్య చేయాలని డిసైడ్ అయ్యింది. ఒకరోజు దారుణంగా గొంతు కోసి చంపేసింది. డెడ్ బాడీ సూట్ కేస్ లో పెట్టి తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది.