
త్వరలోనే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోలవరం సందర్శనకు వెళ్తారని ప్రకటించారు. పోలవరంపై కేంద్రమంత్రి గజావత్ సింగ్ షెకావత్ ని కూడా కలిశామని చెప్పారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి తెలిసిన కొన్ని నిజాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయి అన్నారు. పునరావాస ఖర్చు తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో వైసిపి ప్రభుత్వం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో కేంద్రానికి చెప్పామని ఆయన అన్నారు. ఇంతకీ విశేషమేమిటంటే గజావత్ సింగ్ మొన్న పార్లమెంటులో టోటల్ ది 45 1/2అడుగులు ఏదైతే ఉందో అది పొరపాటున కూడా తగ్గించే ప్రసక్తే లేదని, మొదటి దశలో 41 1/2అడుగులు కామన్ అని, దశలవారీగా జరిగే ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
ఒకవేళ ఇది అసత్యమైతే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా తప్పులేదు. కేంద్ర ప్రభుత్వమే మొన్న చెప్పింది పూర్తి ఎత్తు ఉందని చెప్పి, మరి ఇప్పుడు ఈయన ఈ మాటలు మాట్లాడటం అంటే ఇదేదో తెలుగుదేశపు ఎత్తుగడలో భాగంగా కనిపిస్తుంది అనేది కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రేపు బిజెపి పార్టీ నుండి విడిపోవడానికి ఒక స్టీల్ ప్లాంట్, పోలవరం లాంటివి రేజ్ చేస్తారా? అదే ఇప్పుడు క్యారీ చేస్తూ రేపొద్దున పోలవరం కి వెళ్లడం ఇట్లాంటివి చేస్తూ నిదానంగా ఇక బిజెపితో ఈ కారణాల వల్ల కలవట్లేదు అని చెప్తారేమో అని అంటున్నారు వాళ్లు.