
1991 దాకా 100 వరకు అణు బాంబులు రష్యా వద్ద ఉండేవి. అణ్వయుధాలు ఇచ్చేయమని చెప్పినా సమయంలో కూడా ఉక్రెయిన్ ను నాటో లో అమెరికా చేర్పించలేదు. అప్పుడు మాట తప్పారు. ఇప్పుడు కూడా నాటో లో చేర్పిస్తామని ఇంత యుద్దం కొనసాగుతున్న ఇప్పటికీ చేర్చుకోవడం లేదు. దీని వల్ల రష్యా యుద్ధంలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. గతంలోనూ అమెరికాను నమ్మి ఉన్న అణ్వయుధాలను ఇచ్చేసి నష్టపోయాం. ఇప్పుడు రష్యాతో యుద్దం కొనసాగుతున్న నాటో చేర్చుకోకపోవడంతో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నామని వాపోతున్నారు.
నాటో లో చేర్చుకుంటే ఒప్పందం ప్రకారం అందులో ఉన్న సభ్యత్వ దేశంపై ఏ దేశమైనా యుద్దం చేస్తే అన్ని కలిసి పోరాడాలి. అలా పోరాటం చేయడం వల్ల ఉక్రెయిన్ రష్యా పై గెలిచి తీరుతుందని జెలెన్ స్కీ భావిస్తున్నారు. కానీ యూరప్ దేశాలు, అమెరికా ఇప్పటికీ ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకోవడానికి వెనకంజ వేస్తున్నాయి. అసలు ఎందుకు చేర్చుకోవడం లేదో ఉక్రెయిన్ కు సరైన వివరణ ఇవ్వడం లేదు. నాటోలో ఉక్రెయిన్ గనక చేరితే రష్యా అణ్వస్త్ర దాడికి దిగుతుందని భయంతోనే ఆయా దేశాలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.